Delhi | కేజ్రీవాల్ లేఖ

Delhi | కేజ్రీవాల్ లేఖ

Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు కాబోనని స్పష్టం చేస్తూ లేఖ రాశారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని అందులో పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం దెబ్బతిన్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేపడతానని ప్రకటించారు. తనపై జరుగుతున్న వ్యవహారాన్ని ప్రజలకు తెలియజేయడానికి శాంతియుత నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కేజ్రీవాల్ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply