England T20 Rankings | నంబర్‌వన్ ర్యాంక్ గల్లంతు..
టీమిండియాకు షాక్..
England T20 Rankings | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసిన భారత జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 తేడాతో ఓటమిపాలైన టీమిండియా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయింది. భారత్ స్థానంలో ఇంగ్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటింది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆతిథ్య జట్టు, అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్‌ను లక్ష్యానికి దూరంగా నిలిపి 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 4-0తో సొంతం చేసుకోవడంతో పాటు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
టీమిండియా 2022 ఫిబ్రవరి నుంచి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ కాలంలో 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లను గెలిచి అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 1,601 రోజుల పాటు ప్రపంచ నంబర్‌వన్ జట్టుగా కొనసాగిన భారత్, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువకాలం అగ్రస్థానంలో నిలిచిన జట్లలో ఒకటిగా నిలిచింది.
అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన తాజా సిరీస్‌లో వరుస పరాజయాలు టీమిండియా ర్యాంకింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇప్పుడు జట్టు మళ్లీ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకోవాలంటే రానున్న అంతర్జాతీయ సిరీస్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
