బాధిత కుటుంబాలకు అండగా సీఎం సహాయ నిధి..
- జక్కంపూడి-1లో రెండు సి.ఎం.ఆర్.ఎఫ్ ఎల్.ఓ.సీలు పంపిణీ…
- మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు చొరవతో రూ.3.54 లక్షల వైద్యసాయం..
విజయవాడ రూరల్ (వెస్ట్), ఆంధ్రప్రభ : మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు చొరవతో విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి-1 గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులకు మొత్తం రూ.3,54,491 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) లెటర్ ఆఫ్ క్రెడిట్లు పంపిణీ చేశారు.
గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేడూరు నరేంద్ర బాధిత కుటుంబాలకు ఎల్.ఓ.సీలను అందజేశారు. గర్నేపూడి వెంకటేశ్వరరావుకు వైద్య చికిత్స కోసం రూ.1,22,828, గుంజి తిర్పతమ్మకు రూ.2,31,663 విలువైన ఎల్.ఓ.సీలు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ.. పేదలకు ఖరీదైన వైద్య చికిత్స అందించడంలో సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్యసాయం అందేలా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కృషి చేస్తున్నారని కొనియాడారు. సహాయం అందుకున్న బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
