మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత..

మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత..

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లె గ్రామానికి చెందిన కొండోజు వనమ్మ ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందారు. ఈసమాచారంతో ఆదివారం స్థానిక సర్పంచ్ గాజు క్రిష్ణవేణి యుగంధర్ యాదవ్, ఉపసర్పంచి వంటేరు కుమారు స్వామి పాటు పంచాయతీ సభ్యులు మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మనోధైర్యాన్ని గెలిపించి భరోసా ఇచ్చారు. అనంతరం 50 కేజీల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్లవేళలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ఈసందర్బంగా హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply