Tamilnadu cm | విజయ్‌తో లోకేశ్ భేటీ వైరల్

Tamilnadu cm | విజయ్‌తో లోకేశ్ భేటీ వైరల్

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ హీరోని దర్శకుడు కలిసిన లేదా.. నిర్మాతను కలిసిన వాళ్ల ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారన్న న్యూస్‌ ఇట్టే వైరల్ గా మారిపోతుంది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను దర్శకుడు లోకేష్‌ కనగరాజ్ కలవడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం చాలా మంది దర్శకులు, సినీ ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేరారు. ఆయన ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి, విజయ్ రాజకీయ ప్రస్థానం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను లోకేష్ సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకుముందు ప్రముఖ దర్శకులు ఏఆర్ మురుగదాస్, వెంకట్ ప్రభు కూడా సీఎం విజయ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వెంకట్ ప్రభు తన 2024 స్పై థ్రిల్లర్ చిత్రం ‘గోట్‌’ లో ఉపయోగించిన ‘TN-07-CM-2026’ నంబర్ ప్లేట్‌ను విజయ్‌కు బహుమతిగా ఇచ్చారు. అలాగే తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ , తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు నటులు యాక్షన్ కింగ్ అర్జున్, శాంతను కూడా గత వారం ముఖ్యమంత్రిని కలిసి తమ అభినందనలు తెలియజేశారు.

కాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 2023లో వచ్చిన ‘లియో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్‌ తో లోకేష్‌ మరో సినిమా చేయాలని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన విజయ్‌ తను సినిమాలు చేయడం ఆపేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఆయన నటించిన చివరి చిత్రం జననాయగన్‌ వచ్చే నెలలో విడుదల కానుంది.

లోకే:ష్ కనగరాజ్ నటుడిగా పరిచయమవుతున్న ‘DC’ (అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికంటే ముందు ఆయన రజనీకాంత్‌తో ‘కూలీ’ చిత్రం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘AA23’ (తాత్కాలిక నామం) ప్రాజెక్ట్‌పై లోకేష్ వర్క్ చేస్తున్నారు.

CLICK HERE TO READ social media | వెనుక అసలు నిజం ఇదే?

CLICK HERE TO READ MORE