మ‌ద‌ర్ డెయిరీ డైరెక్ట‌ర్ల‌కు స‌న్మానం

మ‌ద‌ర్ డెయిరీ డైరెక్ట‌ర్ల‌కు స‌న్మానం

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా కార్య‌క‌ర్త‌లు సైనికుల్లా ప‌నిచేయాల‌ని బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) పిలుపునిచ్చారు. మదర్ డెయిరీ(Mother Dairy) ఎన్నిక‌ల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి సంధిల భాస్కర్ గౌడ్(Bhaskar Goud)ను ఈ రోజు తెలంగాణ భవన్(Telangana Bhavan) లో కేటీఆర్ స‌న్మానించారు.

ఈ సంద‌ర్బంగా కేటీఆర్ మాట్లాడారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు గెలిచే విధంగా ప్ర‌తి ఒక్క‌రూ ప‌నిచేయాల‌ని కోరారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Guntakandla Jagadish Reddy), ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి(Gongidi Sunitha Mahender Reddy)తో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్, మాజీ ఎంపీపీ(MPP) గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.