ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
తాడ్వాయి, ఆంధ్రప్రభ: తాడ్వాయి శాఖ గ్రంథాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సమాజాభివృద్ధి, విద్యా వికాసం, సామాజిక న్యాయం, ప్రాంతీయ సమానత్వం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప మేధావి ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి గ్రంథపాలకుడు రాజలింగం, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాజ్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
