సర్కారు బడులలో విద్యార్థుల సమగ్ర వికాసానికి కృషి..

సర్కారు బడులలో విద్యార్థుల సమగ్ర వికాసానికి కృషి..
మున్సిపల్ చైర్మన్ కొణతం
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : సర్కారు బడులలోనే విద్యార్థుల సమగ్ర వికాసానికి కృషి జరుగుతుందని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం సంక్షేమ వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఎస్ సీ, ఎస్ టి, బీసీ బాలుర వసతి గృహాల వార్డెన్ల సమన్వయంతో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ర్యాలీ, మానవ హారంలో పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల ఎస్ సి, బి సి, ఎస్ టి, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగ పర్చుకోవాలని కోరారు.
కార్యక్రమం లో మండల విద్యాధికారి ఎం బాలు ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు వార్డెన్ లు చందూలాల్, వెంకటేష్, దేవదాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్,లయన్స్ క్లబ్,వాసవి క్లబ్ ప్రతినిధులు షేక్ యూసుఫ్, చిత్రం విశ్వనాధ్, బాలా వెంకటేశ్వర్లు, నీలా రామ్మూర్తి ఉపాధ్యాయులు ఎం సైదులు ఎం జానకి రాములు, ఎం నాగమణి, ఎం బాలు, ఎం యాదగిరి, టి రామ్మూర్తి , సంకలమద్ది రాంరెడ్డి, యారవ శ్రీనివాస్, హాస్టల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
