ప్రజాప్రతినిధుల కోటాలో కో ఆప్షన్ పదవి ఇవ్వాలి

ప్రజాప్రతినిధుల కోటాలో కో ఆప్షన్ పదవి ఇవ్వాలి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కో ఆప్షన్ పదవి కోసం ఎంపికలో ప్రజాప్రతినిధుల కోటాలో తమకు కో ఆప్షన్ పదవి ఇవ్వాలని మాజీ వార్డ్ మెంబర్, మాజీ కౌన్సిలర్ కారుపోతుల శిరీష శ్రీనివాస్ గౌడ్ కోరుతున్నారు. మంగళవారం వారు ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ.. తాము గత 20 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, బీఆర్ఎస్ పార్టీ 10 ఏండ్లు అధికారంలో ఉన్నప్పటికీ తాము మోత్కూర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ తరపున 1 వ వార్డ్ మెంబర్ గా, మున్సిపాలిటీలో 2 వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందామని, తమకు 10 ఏండ్లు ప్రజాప్రతినిధిగా పని చేసిన రాజకీయ అనుభవం ఉందన్నారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఇదే పార్టీలో కొనసాగుతున్నామని, ఎలాంటి పార్టీ వలసలకు తాము పాల్పడలేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాము అహర్నిశలు కృషి చేశామన్నారు. కో ఆప్షన్ పదవి కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే మందుల సామెల్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లను కలిసి మద్దతు కోరినట్లు తెలిపారు.

Leave a Reply