22వ వార్డులో బిజెపికి వెల్లువెత్తుతున్న మద్దతు
22వ వార్డులో బిజెపికి వెల్లువెత్తుతున్న మద్దతు
- బిజెపి అభ్యర్థి కొలనుపాక భద్రయ్య విస్తృత ప్రచారం
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 22 వ వార్డులో బిజెపి పార్టీకి మద్దతు వెలువెత్తుతున్నది. బిజెపి అభ్యర్థి కొలనుపాక భద్రయ్య పురోహితంతో పట్టణంలోని ప్రజలకు సుపరిచితుడు, ఈ క్రమంలో 22వ వార్డులోని ఓటర్ల ఇంటికి ప్రచారంకి వెళ్లిన క్రమంలో భద్రయ్యను సాదరంగా ఆహ్వానిస్తూ ఓటర్లు మద్దతు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వార్డులోని సమస్యలను తెలుసుకుంటూ వాటి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని భద్రయ్య ఓటర్లకు హామీ ఇచ్చారు. 22 వార్డులో ఓటర్ల ఆదరణతో ఘన విజయం సాధిస్తానని భద్రయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి, బీజేవైఎం నాయకులు కొలనుపాక అనిల్, కొలనుపాక సిద్దు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
