గెలుపు దిశగా జోరుగా ఆరో వార్డులో ప్రచారం..
వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాజికవేత్త డాక్టర్ కాపా మురళీకృష్ణ సతీమణి డాక్టర్ చంద్రకళ కు ఆ వార్డులో మంచి ఆదరణ లభిస్తుంది… డాక్టర్ చంద్రకళ గెలవాలంటూ మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఆమెకు హారతి పడుతూ కుంకుమ దిద్దుతున్నారు.. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే డాక్టర్ కాపా మురళీకృష్ణ నుండి సేవలు పొందిన వారు.. అంతేకాకుండా డాక్టర్ చంద్రకళ నుండి వైద్య సేవలు పొందిన ప్రతి ఒక్కరూ… ఆ వార్డులో ఆ డాక్టర్ దంపతుల సేవలు కోసం తపన పడుతున్నారు… వారి వెంట నడుస్తూ వారి గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ.. వారు నిర్వహించిన మంచి కార్యక్రమాలను ఓటర్లకు తెలియజేస్తున్నారు… ఆరో వార్డులో పెద్ద ఎత్తున ప్రజలు డాక్టర్ చంద్రకళకు నీరాజనాలు పలుకుతూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు… కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్, రామకృష్ణ, ఆ వార్డులోని ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
