Labor hubs in 15cities | ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలనే అడుగుతా

Labor hubs in 15cities | ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలనే అడుగుతా

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కార్మికులకు లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం లేబర్ అడ్డాలు నిర్మిస్తున్నామని, ఇవి భవిష్యత్తులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మారాలని ఆకాంక్షించారు.

తొలి దశలో రాష్ట్రంలోని 15 నగరాల్లో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని చెప్పారు.

ఇకపై ప్రతి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రజలనుంచే అభిప్రాయం తెలుసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారికి మరోసారి అవకాశం ఉండదని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతున్నామని, 2027లో గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Leave a Reply