ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తలు పాటించాలి..

ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తలు పాటించాలి..
- ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ,
చిట్యాల, ఆంధ్రప్రభ : జాతీయ ఉపాధి హామీ కూలీలు ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ మనోజ్ వివరించారు. చిట్యాల సామాజిక వైద్యశాల సూపరిండెంట్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలకు ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ మనోజ్. నర్సింగ్ సూపరిండెంట్ సరోజిని, నర్సింగ్ ఆఫీసర్ శిరీష, ఎండలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే పని చేయాలన్నారు.
సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మాత్రమే పని చేయాలని, తలపై టవలు కట్టుకోవాలి. ఎక్కువ మోతాదులో వాటర్ తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, తీసుకోవాలి, కిరాణం షాపులో మెడికల్ షాప్ లో డబ్బాలో దొరికే ఓఆర్ఎస్ కాకుండా ప్యాకెట్ లో వచ్చే ఓ ఆర్ఎస్ వాడాలని పలు జాగ్రత్తలు తెలిపారు. అనంతరం కూలీల ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది కట్కూరి నరేందర్. ఉప్పుల కిరణ్. కారోబార్ సదానందం తదితరులు పాల్గొన్నారు.
