AP | తాళ్ల‌పూడిలో విషాదం – గోదావ‌రిలో మునిగి అయిదుగురు విద్యార్ధులు మృతి..

తాళ్ల‌పూడి – మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు నదీస్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో నేటి ఉద‌యం విషాదం చోటుచేసుకుంది. తాడిపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. . వీరిలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురూ గల్లంతయ్యారు.

ఆ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో టి. పవన్ (17), పి. దుర్గాప్రసాద్ (19), పి. సాయి కృష్ణ (19) మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎ. పవన్ (19), జి.ఆకాశ్ (19) ఆచూకీ కోసం గాలిం కొనసాగుతోంది. వీరంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు. వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలముకున్నాయి. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *