మహనీయుల ఆశయ సాధనకు కృషి..

మహనీయుల ఆశయ సాధనకు కృషి..

  • స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన పూలే
  • సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

ధర్మపురి, ఆంధ్రప్రభ : సమాజంలో అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనపై పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే అని.. అలాంటి మహనీయుడి ఆశయ సాధన కొ సం కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి లక్ష్మణ్కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే తీసుకువచ్చిన అనేక సంస్కరణలు అణగారిన వర్గాల పాలిట వరంగా మారాయన్నారు.

స్వేచ్ఛ సమానత్వం కోసం పూలే చేసిన సేవలు, పోరాటాలను చేశారని గుర్తు చేశారు. మహిళలకు చదువు నేర్పిస్తే సమాజం బాగుంటుందని భావించి తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించారన్నారు. సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలకు చదువు నేర్పించారని మంత్రి గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధన అందరం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.