రేపు జగిత్యాలకు కేటీఆర్…

రేపు జగిత్యాలకు కేటీఆర్…
- కెసిఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన
జగిత్యాల, ఆంధ్రప్రభ ; భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం జగిత్యాల జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈనెల 20న జగిత్యాలలో తలపెట్టిన కేసీఆర్ సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించి గులాబీ నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. బిఆర్ఎస్ జగిత్యాల సభ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి విధితమే. లక్ష మందికి పైగా బహిరంగ సభకు హాజరవుతారని సమాచారం.
