వడదెబ్బ తగలకుండా చర్యలు..

జైనూర్, ఆంధ్రప్రభ ; ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పనులు చేసేటప్పుడు వడదెబ్బలు తగలకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచం లోద్ధి పంచాయతీ సర్పంచ్ మడావి మనోహర్ అన్నారు. పంచాయతీలోని దేవుగూ డలో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పనులు చేస్తుండగా అలసట కలిగినప్పుడు కూర్చోవడానికి నీడతో పాటు చల్లని నీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, పనులు చేసేటప్పుడు కూలీలకు ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలితే ప్రథమ చికిత్స కిట్లను కూడా అందుబాటులో ఉంచామని సర్పంచ్ మడావి మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెస్రం మారు, ఫీల్డ్ అసిస్టెంట్ దత్తు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply