చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటన
చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటన
చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో నేడు పాల్గొననున్నారు. మంత్రి ఉ:10.గం.లకు మందమర్రిలోని B1 కార్యాలయంలో నిర్వహిస్తున్న BLA-2 సమీక్ష సమావేశంలో, మ:12.గం.లకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ భీమా గార్డెన్ లో నిర్వహిస్తున్న BLA-2సమీక్ష సమావేశంలో, మ:1.30గం.లకు జైపూర్ మండల కేంద్రంలో ఇటీవల మరణించిన తోట మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
2.గం.లకు భీమారం మండల కేంద్రంలోని నందనవనంలో నిర్వహిస్తున్న BLA-2సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సా:4.గం.లకు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న కోటపల్లి మండలం, చెన్నూర్ టౌన్ BLA-2 సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు బస చేయనున్నట్లు తెలిపారు.
