చంద్రబాబు మొక్కలు నాటితే… జగన్ చెట్లు నరికాడు..
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
విజయవాడ,ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ కొరకు 2014 – 2019 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షలాది మొక్కలు నాటితే తదుపరి 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ తాను ఎక్కడుకు వెళితే అక్కడ చెట్లు నరికించాడని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు.శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆటోనగర్‌లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం ఆవరణలో ఉసిరి, మామిడి వంటి పర్యావరణానికి మేలు చేసే మొక్కలను టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ నాటారు.
ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు సైకిళ్లపై కార్యాలయానికి చేరుకుని సైకిల్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గద్దె అనురాధ మాట్లాడుతూ, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్‌పై ప్రయాణించడం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. సైకిల్ వినియోగం వల్ల వ్యక్తిగతంగా ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన వినియోగంపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో సైకిల్ వంటి పర్యావరణహిత రవాణా మార్గాలను ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు.
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘పచ్చదనం – పరిశుభ్రత’ కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటిన విషయాన్ని గుర్తు చేశారు. మొక్కలు నాటడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తగ్గడమే కాకుండా వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరిగి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందుతుందని అన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆయన ఎక్కడికి వెళ్లినా చెట్లను నరికివేసే సంస్కృతి కనిపించేదని విమర్శించారు. చంద్రబాబు గారు “మొక్కేయండి” అంటూ పర్యావరణ పరిరక్షణకు పిలుపునిస్తే, గత ప్రభుత్వం “చుక్కేయండి” అంటూ మద్యం విధానాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని అన్నారు. ఒకవైపు చంద్రబాబు పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తే, మరోవైపు జగన్ పాలనలో చెట్ల నరికివేతలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందని గద్దె అనురాధ పేర్కొన్నారు. చెత్తను శాస్త్రీయంగా సేకరించి, అందులోని ప్లాస్టిక్‌ను వేరు చేసి పునర్వినియోగం చేయడం ద్వారా ‘చెత్త నుంచి సంపద’ సృష్టించే ఆలోచన చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. పరిశుభ్రమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవాన్ని కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వీలైనంత వరకు సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న చిన్న మార్పుల ద్వారానే పెద్ద ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
జగన్ పాలనలో చెట్ల నరికివేతలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందని గద్దె అనురాధ పేర్కొన్నారు. చెత్తను శాస్త్రీయంగా సేకరించి, అందులోని ప్లాస్టిక్‌ను వేరు చేసి పునర్వినియోగం చేయడం ద్వారా ‘చెత్త నుంచి సంపద’ సృష్టించే ఆలోచన చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. పరిశుభ్రమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవాన్ని కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వీలైనంత వరకు సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న చిన్న మార్పుల ద్వారానే పెద్ద ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి దయాల శిరీష గాంధీ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చలసాని రమణారావు, జిల్లా అధికార ప్రతినిధి పటాన్ హయత్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు నాదెళ్ల రాజేష్, కొక్కెర తిరుపతయ్య, పార్టీ నాయకులు గొల్లపూడి నాగేశ్వరావు, కోనేరు రాజేష్ జాస్తి సురేష్, గుమ్మడి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
