వాహనాల తనిఖీల్లో పత్రాలు లేని వాహనాల సీజ్.

వాహనాల తనిఖీల్లో పత్రాలు లేని వాహనాల సీజ్.

పెద్ద రెల్లి వీధిలో రెండవ పట్టణ పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం పట్టణ పరిధిలోని పెద్ద రెల్లి వీధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి , మద్యం, ఇతర అనధికార పేలుడు పదార్థాలు అక్రమ నిల్వలు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలన్న ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం శ్రీకాకుళం రెండవ పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈశ్వర రావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో గల పోలీసులు పాల్గొని ఆ ప్రాంతంలోని ఇళ్లు, వీధులు, ఖాళీ స్థలాలు , పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేయడంతో పాటు కొత్త,అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు. గంజాయి , మద్యం అక్రమ నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు.వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాలు, అవసరమైన రికార్డులను తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు, రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులకు అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించడంతో పాటు మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు చేపట్టబడుతున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఈశ్వర రావు మాట్లాడుతూ, నేరాల నివారణ, గంజాయి , మద్యం అక్రమ నిల్వలను అరికట్టి,చోరీలకు గురైన వాహనాల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడమే ఈ ఆపరేషన్ ఉద్దేశ్యం అని తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని,అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.పట్టణ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

Leave a Reply