క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

  • మున్సిపల్ కౌన్సిలర్ అలె చిరంజీవి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : క్రీడా పోటీలలో తరచుగా పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని చౌటుప్పల్ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ ఆలే చిరంజీవి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో గతవారం రోజుల నుండి భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో దాదాపు 13 గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొనగా భగత్ సింగ్ వర్ధంతి సందర్బంగా ఫైనల్ పోటీ నిర్వహించారు. విజేతలకు మరో కౌన్సిలర్ బత్తుల జయమ్మతో కలిసి ఆలె చిరంజీవి బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుండాలని, చెడు వ్యాసనాలకు, ఆన్లైన్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలన్నారు. ఈ టోర్నమెంట్ లో మొదటి విజేతగా రంగారెడ్డి (మల్కాపురం), రెండో విజేతగా శ్రీకాంత్ (తంగడపల్లి) బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ నాయకులు బండారి. నరసింహ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బోయ లింగస్వామి, భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ తూర్పునూరు మల్లేష్ గౌడ్, నక్క లింగస్వామి, లగోని లింగస్వామి, రొట్ట అనిల్ కుమార్, రాజ్ పెరియర్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply