బండ మాదారంలో ఆధ్యాత్మిక శోభ‌

బండ మాదారంలో ఆధ్యాత్మిక శోభ‌

వైభ‌వంగా పెద్దమ్మ తల్లి, బొడ్రాయి ఉత్సవాలు
హాజ‌రైన ఎంపీ ఈటెల రాజేందర్

మేడ్చల్ మే 23(ఆంధ్రప్రభ): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు బండ మాదారం పట్టణం లో పెద్దమ్మ తల్లి, బొడ్రాయి పండుగ మహోత్సవాలు శనివారం రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పట్టణానికి విచ్చేసిన ఎంపీకి స్థానిక నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈటెల రాజేందర్ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో విలసిల్లాలని ఆయన ఈ సందర్భంగా ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పట్లోళ్ల విక్రం రెడ్డి, మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రజిత దేవేందర్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మునిసిపల్ మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్, మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది.