మహిళ దారణ హత్య.. కేసు ఛేదించిన పోలీసులు

మహిళ దారణ హత్య.. కేసు ఛేదించిన పోలీసులు

ప్రియుడే నిందితుడని తేల్చిన మేడ్చల్ పోలీసులు

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసినట్లు మేడ్చల్ ఏసీపీ సి.హెచ్. శంకర్ రెడ్డి తెలిపారు.


ఏసీపీ వివరాల ప్రకారం… రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఓ మహిళ గొంతు కోసి హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


దర్యాప్తులో భాగంగా మృతురాలు దాదాపు పది రోజుల క్రితం మేడ్చల్‌కు వచ్చినట్లు గుర్తించారు.సంగారెడ్డి జిల్లా కొల్లూరు కు చెందిన సుజాత, నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన శివ కృష్ణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఇటీవల ఆమె ఇతరులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో కృష్ణ ఆగ్రహానికి గురై, కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు.

ఈ కేసులో నిందితుడు కృష్ణను బాన్సువాడలో పోలీసులు అరెస్టు చేసి మేడ్చల్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. హత్యకు వాడిన కత్తిపీట సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి చెప్పారు .ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ సత్యనారాయణ , డి ఐ కిరణ్, ఎస్సైలు శ్రీను, మన్మధరావు, అనిత, సురేష్, ఎతీష్, పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.

Leave a Reply