న్యూఢిల్లీ – ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన సిబ్బందికి కేంద్రం నుంచి రావలసిన ఏడవ వేతన సవరణ సంఘం అరియర్స్ ను విడుదల చేయించవలసిందిగా కోరుతూ బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యుల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
వ్యవసాయ వర్సిటీ బోధన సిబ్బంది ఏడవ వేతన సవరణ సంఘం అరియర్స్ విషయంలో సహకరించమని కోరుతూ, వారికి కేంద్రం నుంచి రావలసిన 17.5 కోట్ల రూపాయలను సెంట్రల్ గ్రాంట్ గా రిలీజ్ చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం వినతి పత్రాన్ని కూడా జతచేస్తూ నిర్మలా సీతారామన్ కు అందజేశారు. ఆర్థిక మంత్రిని కలసిన బృందంలో ఈటెల తో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్ లు ఉన్నారు.
యూనివర్సిటీ బోధన సిబ్బంది కి, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ పీ ఆర్ సి ఆరియర్స్ సెంట్రల్ గ్రాంట్ విషయంలో చొరవ తీసుకున్నందుకు ఈటల రాజేందర్ బృందానికి వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది.