త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థులు వీరే..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని పల్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్.పి.హెచ్.ఎస్) విద్యార్థినులు బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్.జి.యు.కే.టి) ప్రవేశాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ప్రధానో పాధ్యాయురాలు అనురాధ మీడియా ప్రకటన ద్వారా తెలిపారు.పాఠశాల లో చదువుకున్న శ్రీ చైత్ర, అఖిల, వర్షిణి అనే విద్యార్థినులు పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి, బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు కైవసం చేసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, ఎలాంటి కార్పొరేట్ హంగులు లేకపోయినా పట్టుదలతో శ్రమించి ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.అభినందనల జల్లు గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు ఒకేసారి ట్రిపుల్ ఐటీకి ఎంపికవ్వడం పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థినులను ప్రధానో పాధ్యాయులు అనురాధ, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ పిండి. మనుష (అశోక్,) గ్రామ నాయకులు,గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో వీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
