suicide | ఇంతకీ.. ఎవరీ మహిళ..?

suicide | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా, కోవెలకుంట్ల (Kovelakuntla) నుంచి వెళ్లే రైల్వే లైన్ సౌదరదిన్నె, ఆమడాల గ్రామాల మధ్యలో ఆదివారం మహిళా మృతదేహం రైల్వే ట్రాక్ పక్కన పడింది. ఇది చూసిన కొందరు వ్యక్తులు పోలీసులకు (police) సమాచారం అందించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆ మహిళ వయసు సుమారుగా 40 సంవత్సరాలు ఉండవచ్చు అన్నారు. రైలు కిందపడి ఆత్మహత్య (suicide) చేసుకుందా? అనేది తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ మృతదేహం పక్కన కర్చీఫ్ లో ఆభరణాలు కట్టి ఉన్నాయి. తల, మొండెము వేరువేరుగా ట్రాక్ పక్కన పడి ఉన్నాయి. మృతురాలి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మహిళ ఎవరు? అసలు ఏం జరిగింది..? అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply