Mahabubabad | రెండో విడత నామినేషన్లకు సర్వం సిద్ధం
Mahabubabad | రెండో విడత నామినేషన్లకు సర్వం సిద్ధం
Mahabubabad | పెద్దవంగర, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రెండో విడత నామినేషన్ (Nomination) స్వీకరణకు సర్వం సిద్ధం చేశామని ఎంపీడీవో వేణుమాధవ్, ఎస్సై ప్రమోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ కేంద్రాల వద్ద లాజిస్టిక్ ఏర్పాట్లు, హెల్ప్ డెస్క్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల లోపు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అభ్యర్థితో కలిపి ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. మండలంలోని తొమ్మిది క్లస్టర్లలో అన్ని సౌకర్యాలు కల్పించామని ఎంపీడీవో అన్నారు.

