అయ్యప్ప స్వామి ఆలయంలో మహా పడిపూజ..

అయ్యప్ప స్వామి ఆలయంలో మహా పడిపూజ..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో బొబ్బిళ్ళ మురళి గురుస్వామిచే విష్ణు పూజ సందర్భంగా దేవాలయం మూలవిరాట్లకు పంచామృతాభిషేకంలు, మహా పడిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గుప్త గురుస్వామి మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రంలో నూతన సంవత్సర ప్రారంభోత్సవం సందర్భంగా శబరిమల అయ్యప్ప దేవాలయంలో స్వామి వారికి లోక కళ్యాణం కోసం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం సర్వలోకాలపై ఉండాలి. ఈ సంవత్సరం వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. అమెరికా, ఇరాన్ దేశాల యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయని, ఇలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ యుద్ధాలు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దయవల్ల ఆగాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, ఆలే శ్రీలత చిరంజీవి, గురు స్వాములు చింతల సాయిలు, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఉప్పు ఆంజనేయులు, అంతటి రాము, గుత్తికొండ సుధీర్, పెద్దగోని రమేష్, కామిశెట్టి చంద్రశేఖర్, కంచరకుంట్ల వెంకట్ రెడ్డి, తోర్పునూరి నరసింహ, ఉష్కాగుల నాగరాజు, బొడ్డు రాజేందర్ రెడ్డి, గుర్రం వెంకటేశం, కాసుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply