హోంగార్డు సురేష్ మృతి

హోంగార్డు సురేష్ మృతి
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన హోంగార్డు సురేష్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన సురేష్ గత కొంతకాలంగా పోలీస్ శాఖలో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రస్తుతం బీబీపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.
గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయం మండల కేంద్రంలో తెలియడంతో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. మృతుడు సురేష్ దుర్గామాత కమిటీలో సభ్యునిగా కొనసాగుతున్నారు. దీంతో కమిటీ సభ్యులు సైతం కంటతడి పెట్టారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మండల కేంద్రంలో జరిగిన అత్యక్రియల్లో మృతుని స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
