Drinks | వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందండి..

Drinks | వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందండి..

Drinks | వేసవిలో శీతల పానీయాల ప్రాముఖ్యత
సబ్జా గింజలు, అలోవేరా జ్యూస్ ప్రయోజనాలు
కూరగాయల జ్యూస్‌లతో ఆరోగ్య రక్షణ
సంప్రదాయ పానీయాలు – కొబ్బరి నీళ్లు, చెరుకు రసం
పండ్ల రసాలతో శరీరానికి శక్తి
పుదీనా, తులసి వంటి హెర్బల్ పానీయాల ఉపయోగం
నిమ్మరసం, బెల్లం పానకం ఆరోగ్య లాభాలు

Drinks | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : వేస‌వి మొద‌లైంది. అప్పుడే ఎండ‌లు మండిపోతున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడి ప్రతాపానికి మాడు ప‌గ‌లిపోతోంది. బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే జ‌నం భ‌య‌ప‌డుతున్నారు. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు జ‌నం దాహంతో అల్లాడిపోతున్నారు. దాహం తీర్చుకోవ‌డానికి చాలామంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. రసాయనాలతో నిండిన అవి ఆరోగ్యానికి హానిక‌రం. ఇందువ‌ల్ల ఆరోగ్యకరమైన శీతల పానీయాలను ఎంపిక చేసుకోవడం మంచిది.

Drinks

వేస‌విలో సబ్జా గింజలతో కూడిన పానీయాలు తీసుకుంటే మంచిది. శరీరానికి కూలింగ్‌ ఇచ్చే ఈ గింజలు, అధిక వేడిలో పొట్టకు ఉపశమనంగా పనిచేస్తాయి.
అలోవేరా జ్యూస్‌ దాహాన్ని తీరుస్తూనే, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మానికి కూడా లాభదాయకంగా ఉంటుంది.
క్యారెట్, బీట్‌రూట్, కీరా వంటి కూరగాయల జ్యూస్‌లు చాలా మేలు చేస్తాయి.
వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో ఇబ్బంది లేకుండా తేలికగా జీర్ణమై, శరీరానికి శక్తిని అందిస్తాయి.
బీట్‌రూట్‌ జ్యూస్‌ రక్తహీనత నివారణకు, క్యారెట్‌ జ్యూస్‌ కంటికి మేలు చేస్తుంది.
కీరా శరీర ఉష్ణోగ్రత త‌గ్గిస్తుంది.
సంప్రదాయ పానీయాలైన కొబ్బరి నీళ్లు, చెరుకు రసం సహజమైన తీపి, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
కొబ్బరి నీళ్లు, కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తే, చెరుకు రసం శక్తిని పెంచుతుంది.
పుదీనా, తులసి వంటి ఔషధ గుణాలు కలిగిన పానీయాలు.
వీటిలో పుదీనా శ్వాస సంబంధిత సమస్యలకు, తులసి ఇమ్యూనిటీ మెరుగు పరిచేందుకు సహాయపడతాయి.
ఇవి హెర్బల్‌ టీ, తులసి వాటర్‌ వివిధ రూపాల్లో లభిస్తున్నాయి.
నారింజ జ్యూస్‌లో చిన్న ముక్క అల్లం గ్రేటర్‌తో తురిమి కలపాలి. తేనె లేదా స్టీవియా చేర్చి సేవించాలి.
నారింజలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది.
ఇది చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించి ప్రకాశవంతంగా మారుస్తుంది.
నారింజ రసం తరచూ తాగడం వల్ల శరీరానికి నూతన శక్తిని అందిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్‌ వేసవిలో అత్యంత ఉపయోగకరం.
ఇది 90% నీటి శాతం కలిగి ఉండటంతో శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తుంది.
ఇందులో విటమిన్లు A, C మరియు లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి చర్మాన్ని తేమతో నింపి సూర్యుని ప్రభావాన్ని తగ్గిస్తాయి.
పైనాపిల్ జ్యూస్ తాగితే విటమిన్ C అందుతోంది.
ఈ పండులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
నిమ్మకాయలో అధిక మోతాదులో విటమిన్ C ఉంటుంది.
శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.
నిమ్మరసం తరచుగా తాగితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
పుదీనాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
బెల్లం – పంచదారపానకం వేసవిలో శరీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బెల్లంలో ఉండే ఖనిజాలు శరీరానికి కావలసిన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తాయి.
కొబ్బరి నీరు సహజంగా శరీరాన్ని హైడ్రేట్ చేసే ఉత్తమమైన పానీయం.
ఇందులో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండటంతో ఒంట్లో వేడి తగ్గుతుంది.
ఇది తేనెలో రసం కలిపి తాగితే మరింత శక్తినిస్తుంది.
తాజా కొబ్బరి నీటిని నేరుగా తాగాలి.

Drinks
Drinks

Leave a Reply