సిరివెన్నెల గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : అడవి జంతువులకు అడవిలోనే సహజసిద్ధమైన ఆహారం అందేలా చేయాలనే ఉద్దేశంతో సిరివెన్నెల గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ముత్తకుంట అడవిలో 15 వేల సీడ్ బాల్స్ చల్లినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రావుట్ల జనార్ధన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవుల్లో పండ్ల చెట్లు తగ్గిపోవడంతో అడవి జంతువులు ఆహారం కోసం గ్రామాలు, పంట పొలాల వైపు వస్తున్నాయని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పండ్ల చెట్ల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్‌ను అడవిలో చల్లుతున్నట్లు వివరించారు.

ప్రజలు, యువత ముందుకు వచ్చి అడవుల్లో పండ్ల చెట్లను నాటాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గంగారెడ్డి, మగ్గిడి దేవదాస్, రవికుమార్, రవికిరణ్, ధీరజ్, అక్షత, అస్మిత తదితరులు పాల్గొన్నారు.