గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం పోచారం గ్రామం లో బుధవారం గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు మూడు లక్షల రూపాయల వ్యయంతో గ్రావెల్ రోడ్డు నిర్మాణం, మరో మూడు లక్షల రూపాయల వ్యయం తో సీసీ డ్రైన్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు స్థానిక సర్పంచ్ నీరడి జ్యోతి రవి తెలిపారు.
కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
