samantha | ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’..
స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రేక్షకులను అలరించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
స్ట్రీమింగ్ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. “ఒక్కొక్కర్ని కొడతాము చూడు… ప్రేమతో అబ్బా!” అనే క్యాప్షన్‌తో చిత్రబృందం ఓటీటీ విడుదల తేదీని వెల్లడించింది. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. థియేటర్లలో చూడలేకపోయిన వారు జూలై 17 నుంచి ఇంటి వద్దే ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ చేరినట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
