బీఎల్‌ఓలకు అవగాహన కార్యక్రమం

బీఎల్‌ఓలకు అవగాహన కార్యక్రమం

రేగొండ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్) కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలులో భాగంగా, బుధవారం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రేగొండ మరియు గోరి కొత్తపల్లి మండలాలకు చెందిన బీఎల్‌ఓలు మరియు బీఎల్‌ఓ సూపర్వైజర్లకు సార్ కార్యక్రమంపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి హరికృష్ణ హాజరై మాట్లాడారు. జూన్ 25 నుండి ప్రారంభం కానున్న సార్ ప్రక్రియలో భాగంగా ప్రతి బీఎల్‌ఓ ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలని సూచించారు. ప్రతి ఓటర్‌ను బీఎల్‌ఓ యాప్ ద్వారా మ్యాపింగ్ చేయాలని తెలిపారు.

ఓటర్లు తమ వివరాల నిర్ధారణ కోసం 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించాలని, ఈ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన బీఎల్‌ఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రేగొండ తహసిల్దార్ శ్వేత, గోరి కొత్తపల్లి తహసిల్దార్ హేమ, డిప్యూటీ తహసిల్దార్లు అబ్దుల్ రజాక్, శ్రీలత, ఆర్‌ఐలు వెంకటేష్, రాజ్యలక్ష్మి, మాస్టర్ ట్రైనర్లు తిరుపతి, రామయ్య, దినేష్, నవీన్, బీఎల్‌ఓ సూపర్వైజర్లు రాజయ్య, వేణు, శ్రీకాంత్, రమేష్, వెంకటేష్, జ్యోతి, శ్వేత మరియు బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.