Shiva jyothi | కాస్ట్ లీ బిచ్చగాళ్ళు… ఇలా మాట్లాడితే ఊరుకుంటారా..?

Shiva jyothi | కాస్ట్ లీ బిచ్చగాళ్ళు… ఇలా మాట్లాడితే ఊరుకుంటారా..?

Shiva jyothi, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యాంకర్ శివజ్యోతి సోషల్ మీడియా జనాలకు బాగా తెలిసిన పేరు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆతర్వాత బిగ్ బాస్ లో (Big Boss) ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ నుంచి బాగా పాపులర్ అయ్యింది. పలు టీవీ షోల్లో, ఈవెంట్స్ లో పాల్గొంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. తాజాగా శివజ్యోతి వివాదంలో చిక్కకుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో.. టీటీడీ పాలక మండలి అందించే అన్న ప్రసాదం పై మేము రిచెస్ట్ బిచ్చగాళ్ల మంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అయితే.. ఈ వివాదం పై శివజ్యోతి స్పందించారు. వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను శివజ్యోతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం ఇక ముగిసింది అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుందని.. ఇంకెప్పుడూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వీలు లేకుండా శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది నిజమా..? కాదా..? అనే విషయం పక్కనపెడితే.. పెదవి దాటని మాటకు ప్రభువు నీవు.. పెదవి దాటిన మాటకు బానిసవు నీవు అంటారు.

ఇటీవల రాజమౌళి (Rajamouli) వ్యాఖ్యలు కూడా వివాదస్పదం అవ్వడం తెలిసిందే. ఆయన వారణాసి ఈవెంట్ లో ఒక డ్రోన్ సరిగా వర్క్ చేయకపోవడంతో హనుమా చూసుకుంటాడు అన్నారు. ఏం చూసుకున్నాడు అంటూ కామెంట్ చేయడం వివాదస్పదం అయ్యింది. ఇక అక్కడ నుంచి రాజమౌళి పై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు విమర్శించడం.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. ఎవరైనా సరే.. పొరపాటున నోరు జారితే ఇక అంతే సంగతులు. వాళ్లు ఎంత పెద్ద వాళ్లు అయినా సరే.. నెటిజన్లు వదలడం లేదు. అందుకే.. నోరు జారిన తర్వాత బాధపడడం కంటే.. నోరు జారకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది.

మాట్లాడేటప్పుడు.. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.. నోరు అదుపులో పెట్టుకోవాలి.. ఎక్కడ ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు.. ఏ విషయాల పట్ల ఎంత స్పందించాలి.. అనే సంయమనం లేకపోతే ఎంతటి వారినైనా చట్టం, సమాజం ఉపేక్షించదు.. సహించదు.. దీనికి తాజాగా శివజ్యోతి, రాజమౌళి సంఘటనలే ఉదాహరణ. ఇకనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారేమో చూడాలి.