హైదరాబాద్ – పసుపు రైతులకు రూ.15వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలి వద్ద ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చాన్నాళ్లుగా పసుపు రైతులు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని, పసుపు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న అంశంపై కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణలోని పసుపు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పసుపు రైతులకు కనీస మద్ద ధర 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నదని, కానీ ఆ పార్టీ పసుపు రైతుల్ని మోసం చేసినట్లు కవిత ఆరోపించారు. అంతకు ముందు పసుపునకు మద్దతు కోరుతూ ప్లకార్డులతో మండలి వరకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ర్యాలీ నిర్వహించారు.
TG Council | పసుపునకు మద్దతు ధర – మండలిలో బిఆర్ఎస్ ప్లకార్డుల ప్రదర్శన
