ఘనంగా శని జయంతి వేడుకలు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : మోమినుపేట మండలం ఎనక తల శ్రీ శనీశ్వరాలయనికి శనివారం అమావాస్య సందర్భంగా శని జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రదక్షిణ నిర్వహిస్తూ శనీశ్వరునికి తైలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి శాంత కుమార్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శని అమావాస్య శనిజయంతి ఒకేరోజు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసినట్టు ఆయన పేర్కొన్నారు జిల్లాలో గల ఏకైక శనీశ్వరాలయం ఇదే కావడంతో జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారని ఆయన పేర్కొన్నారు.
