బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
- కడెం మండలం సారంగాపూర్‌లో విషాదం….
- కుటుంబంలో తీవ్ర విషాదం
కడెం, ఆంధ్రప్రభ : బైక్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సారంగాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రాకేష్ (26) తన తండ్రి రమేష్‌ను తరచూ బైక్ కొనివ్వాలని కోరుతున్నాడు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా బైక్ కొనివ్వలేకపోయారు.
దీంతో మనస్థాపానికి గురైన రాకేష్ ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్తానని చెప్పి గోదావరి తీర ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కడెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాకేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
