Amaravati | రాందేవ్ బాబాతో కలిసి చంద్రబాబు యోగా
Amaravati | రాందేవ్ బాబాతో కలిసి చంద్రబాబు యోగా
ఉండవల్లి గుహల్లో ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం
యువత యోగా ప్రతిభపై సీఎం ప్రశంసలు
Amaravati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి యోగా సాధన చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, యోగా సాధన ద్వారా బాబా రాందేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ఆయన శిక్షణలో యువత ప్రదర్శించిన యోగాసనాలు ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతో ఉపయోగకరమని చెప్పారు.
కార్యక్రమంలో బాబా రాందేవ్ వివిధ రకాల యోగా ప్రక్రియలను ప్రదర్శిస్తూ వాటి ప్రయోజనాలను వివరించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. సీఎం చంద్రబాబు యోగా సాధనను తిలకించి పలువురు పాల్గొనేవారిని అభినందించారు.
