పనిచేయని ఎస్‌బీఐ ఏటీఎంలు..

పనిచేయని ఎస్‌బీఐ ఏటీఎంలు..

  • ఇబ్బందుల్లో ఖాతాదారులు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలు ఉదయం నుండి పనిచేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందుల పాలవుతున్నారు .ప్రధానంగా బ్యాంకు సమయాలు కాకుండా ఇతర సమయాల్లో ఏటీఎం లు పనిచేయడం ద్వారా ఖాతాదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. ప్రస్తుతం 10 గంటల లోపు ఎటువంటి ఎటిఎం లో పనిచేయక పోవటంతో ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర ప్రధాన శాఖ ముందుగల ఏటీఎంలో ఐదు మిషను లు ఉన్నప్పటికీ ఏ ఒక్క మిషన్ కూడా పనిచేయడం లేదు అదే విధంగా రామయ్య గూడ రోడ్ మార్గంలో గల ఎటిఎం కూడా పనిచేయకపోవడం గమనార్హం. సంబంధిత అధికారులు స్పందించి ఏటీఎంలను పనిచేసే చూడాలని స్థానికులు, ఖాతాదారులు కోరుతున్నారు కోరుతున్నారు.

Leave a Reply