బొడ్రాయి ఆంజనేయుడి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని బొడ్రాయి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
