Sankranthi | సంబరాలు..

Sankranthi | సంబరాలు..
Sankranthi, నందికొట్కూర్, ఆంధ్రప్రభ : సంక్రాంతి సంబరాలు నందికొట్కూరు పట్టణంలో సందడిగా బుధవారం బ్రాహ్మ ముహూర్తం నుంచి మొదలయ్యాయి. నందికొట్కూర్ నియోజకవర్గంలో జరిగిన భోగి మంటలు వేడుకల్లో మహిళలు, ప్రజలు, విద్యార్థి, విద్యార్థులు పాల్గొని భోగి మంటలు నిర్వహించి అందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలసి వివిధ కాలనీ ప్రజలు తమ ఇంటి ముందు భోగిమంటలు వేశారు. ప్రతీ పల్లెలో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తోందని, ప్రతీ ఇంట సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని చిన్నారులు తమ ఆనందం వ్యక్తం చేశారు.

