సైనికుడు అక్కల వర్మ రెడ్డికి ఘన నివాళులు

సైనికుడు అక్కల వర్మ రెడ్డికి ఘన నివాళులు

పిట్టలవానిపాలెం, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా పిట్టలవాని పాలెం మండలం గోకరాజుపాలెం గ్రామానికి చెందిన సర్వింగ్ సోల్జర్ అక్కల వర్మ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్. గుణ షీలా, ఏ పి ఆర్ ఎం ఎస్ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొని సైనిక గౌరవాలతో నివాళులు అర్పించారు. పార్ధివ దేహంపై జాతీయ పతాకం కప్పి పూలమాలలు సమర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

బాధిత కుటుంబానికి పెన్షన్, ఇతర బెనిఫిట్స్ త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు సిబ్బంది,ఏ పి ఆర్ ఎం ఎస్ ఎస్ ఎస్ రాష్ట్ర కమిటి గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, సీనియర్ మాజీ సైనికులు షేక్ బాజీ, పిట్టు సింగా రెడ్డి, ఆట్ల శివకేశవ రెడ్డి, పోతురాజు రెడ్డి, రామకృష్ణా రెడ్డి మొదలగు మాజీ సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply