మహానాడు వేదికపై బక్రీద్ శుభాకాంక్షలు..

మహానాడు వేదికపై బక్రీద్ శుభాకాంక్షలు..

అమరావతి, ఆంధ్రప్రభ: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
మహానాడు వేదికపై పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.ఎ. షరీఫ్‌తో పాటు ముస్లిం నేతలకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కూడా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ పండుగ విశిష్టతను ప్రస్తావించారు.

