students | గణిత పితామహుడు రామానుజన్

students | గణిత పితామహుడు రామానుజన్
students | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గణిత పితామహుడు ప్రముఖ శాస్త్రవేత్త(Famous scientist) శ్రీనివాస్ రామానుజన్ మనందరికీ ఆదర్శనీయమని ఊట్కూర్ మాజీ సర్పంచ్ శిశుమందిర్ పాఠశాల అధ్యక్షుడు ఎం.భాస్కర్ అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శిశుమందిర్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణిత పితామహుడు రామానుజన్ గణిత ప్రతిభ(mathematical genius)ను గమనించిన ప్రొఫెసర్ సింగారా వేలు ముదలియార్ రామానుజన్ తో కలిసి మ్యాథమెటికల్ లో కష్టమైన సమస్యలను చర్చించి సాధిస్తూ ఉండేవాడన్నారు. శిశుమందిర్ పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలన్నారు.
విద్యార్థులకు నైతిక విలువలతో పాటు చక్కని విద్యా బోధనలు చేపట్టి విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామన్నారు. రామానుజన్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గణితంలో రాణించాలన్నారు. పోటీల్లో ఓటమి చెందిన విద్యార్థులు(students) పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు విశాల్ ఆచార్యులు రోషనప్ప, దేవి కిషోర్, నరసింహా, భారతి, జ్యోతి, రాధ, తదితరులు పాల్గొన్నారు.
