మున్సిపాలిటీ ఆఫీసర్లకు ఏసీబీ దెబ్బ

 మున్సిపాలిటీ ఆఫీసర్లకు ఏసీబీ దెబ్బ

38 మంది బందరు అధికారులపై చర్యలు

అప్పటి కమిషనర్​ సహా.. ఇంజనీర్లుపై కేసులకు సిద్ధం

( మచిలీపట్నం , – ఆంధ్రప్రభ)

మచిలీపట్నం మున్సిపాలిటీలోని రెవెన్యూ, ఇంజినీ రింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో గతంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నిర్వహించిన తనిఖీల్లో పలు అవకతవకలు బయటప డ్డాయి.

 ప్రజల నుంచి లంచాలు వసూళ్లు.. కొత్త నీటి కనెక్షన్లకు బిల్లులు ఇవ్వకపోవడం.. బహుళ అంతస్థు భవనాలను పూరి గుడి సెలు, రేకుల షెడ్లుగా చూపించి తక్కువ పన్నులు విధించడం. ఖాళీ స్థలాలు.. గృహ నిర్మాణాలకు పన్నులు వసూలు చేయకుండా యాజమాన్య పత్రాలు బదిలీ చేయడం తదితర అవకతవకలను అనిశా గుర్తించింది.

దీనికి బాధ్యులైన అప్పటి మున్సిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ.. మరో 37 మంది అధికారులు, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అప్పటి కమిషనర్ శివరామకృష్ణ సహా.. కార్యనిర్వాహక ఇంజినీరు త్రినాథరావు, డీఈ ఈలు జి. సాంబశివరావు, వై. వెంకటరమణ, ఏఈలు ఆర్.గంగా వీరప్రసాద్, పి.ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బి. వెంకటకల్యాణ్, సి. మోహన్ గోపాల్, వి. వినయ్ రాజేంద్రప్రసాద్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగశాస్త్రులు,

టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు పి.వెంకటరావు, జి. కృష్ణ, కె. శ్రీహరిప్రసాద్, టీపీబీవోలు హెచ్. శ్రీధర్, కె. ఆశ, వీరబ్రహ్మం, సీనియర్ అసి స్టెంట్ పి. శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు ఎం. శ్రీనివాస్ కుమార్, ఎం. లత సౌజన్య, బి. పార్వతి, ఎం. స్వర్ణకుమారి, బి. శివశేషుబాబు, ఎస్. హరిప్రసాద్, రికార్డు అసిస్టెంట్ ఎన్. ఏడు కొండలు, బిల్లు కలెక్టర్ టి. రాజేశ్వరరావు, వార్డు పరిపాలన కార్యదర్శులు ఎ.చందు, ఎ. దినకర సుబ్రహ్మణ్యం, బి. దుర్గాప్రకాశ్, కె. భవానీ, కె. శేషు కుమారి, వి.లీలా నాగ రాఘ వరావు, కె. దుర్గాప్రసాద్, ఎం.వీర నాగేంద్ర రావు, పి. ఆదిత్య, వీధి దీపాల సహాయకుడు కె. ఏడుకొండలు, పైప్లను ఫిట్టర్లు బి.సాయి కుమార్, ప్రసాద్, మీటరు రీడర్ విజయ కృష్ణ, వాచ్మెన్ పి.నాగరాజుపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి.