RTC | ఢీ కొట్టిన బస్సు.. బాలుడు మృతి

RTC | ఢీ కొట్టిన బస్సు.. బాలుడు మృతి


RTC | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు (RTC BUS) ఢీకొని ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన దుర్ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల మేరకు.. గంగపట్నం గ్రామంలో రోడ్డు పై వెళుతున్న కిరణ్ కుమార్ (15) అనే బాలుడిని అటు వైపుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆ బాలుడికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.

Leave a Reply