Rs.40thousand | మూడో బిడ్డకు రూ.30 వేలు

Rs.40thousand | మూడో బిడ్డకు రూ.30 వేలు

నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు
త‌ల్లులకు సీఎం చంద్రబాబు వ‌రం

Rs.40thousand | శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ : పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శ‌నివారం జ‌రిగిన స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసరి ఆదాయం పెంచాలనేది తన ప్రధాన లక్ష్యమన్నారు. త‌న ప్ర‌సంగాన్నికొన‌సాగిస్తూ, “మంచి పేరు వచ్చిందంటే అధికారుల వల్లే వస్తుంది. అనునిత్యం నాతో ఉండేది టీడీపీ కుటుంబ సభ్యులే. పేదరికం లేని సమాజం చూడాలనేది నా కోరిక. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం చెప్పాం. పిల్లలే సంపద అని ఇవాళ చెబుతున్నా. మూడో బిడ్డ ఉంటే, పుట్టిన వెంటనే రూ.30 వేలు ఇస్తాం. నాలుగో బిడ్డ పుడితే, పుట్టిన వెంటనే రూ.40 వేలు ఇస్తాం. పిల్లలు భారమనుకోకూడదు, వాళ్లే సంపద అని గుర్తించాలి, భగవంతుడు కరుణిస్తే ఇంకా ఈ మొత్తాన్ని పెంచుతాం. అన్నారు.

Rs.40thousand |
Rs.40thousand |

Rs.40thousand | గొడ్డ‌లి పార్టీ అయిదేళ్ల పాల‌న‌లో ఆరాచ‌కాలే..

గత ఐదేళ్లు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం చూశాం. ప్రజల ఆస్తులన్నీ మార్చేసి గందరగోళం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టాం. భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాం. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే మనకు మంచి చేస్తుంది. అలవాట్లు మారాలి.. తద్వారా సమాజం మారుతుంది. గత 16 నెలలుగా స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్నాం. వ్యర్థాల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఒకప్పుడు నా పాదయాత్రల సమయంలో చెత్తే ఎక్కువ కనిపించేది. చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేశాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలి.

Rs.40thousand | ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’

స్వచ్ఛాంద్రలో భాగంగా ఇవాల్టి నుంచే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజూ క్లీన్ డ్రైవ్లు చేయాలి. గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో మన పిల్లలకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. విశాఖకు గూగుల్ తీసుకొచ్చాం. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెల్లడం కాదు.. పరిశ్రమలతో ఉత్తరాంధ్రకే వలసలు రావాలి” అని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నా పాదయాత్రల సమయంలో చెత్తనే ఎక్కువ కనిపించేది. చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేశాం. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ను మనం నిషేధించాలి. కుప్పం మండలానికి మూడో బహుమతి రావడానికి చాలా కృషి చేశారు. నా ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు రావడం సంతోషంగా ఉంది” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Rs.40thousand | 23 నెల‌ల్లో 23 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు

23 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఒప్పందాలతో మన పిల్లలకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖకు గూగుల్‌ తీసుకొచ్చాం, పరిశ్రమలతో ఉత్తరాంధ్రకే వలసలు రావాలన్నారు. ఎంత చేసినా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కాలేకపోతుంది, ఉత్తరాంధ్రకు అనేక ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు.

CLICK HERE TO READ MORE : Jongnanhai | తైవాన్ జోలికొస్తే.. ఖేల్ ఖ‌తం

CLICK HERE TO READ MORE

Leave a Reply