Bangalore | బండరాయి దొర్లి.. ఏడుగురు మృతి..
Bangalore | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని బెంగళూరు (Bangalore) సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో రాయిని కదిలిస్తున్న సమయంలో అది ఒక్కసారిగా దొర్లిపడటంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు దాని కింద చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా (Seven workers died), మరో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని భారీ యంత్రాల సహాయంతో బండరాయిని తొలగించే చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిని బిహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
