From June 1: అగ్నిపరీక్ష Andhra Prabha News

From June 1: అగ్నిపరీక్ష Andhra Prabha News

  • సైన్యంలో అగ్నిపథ్ నియామకాలు
  • 14 జిల్లాల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు
  • అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం
  • ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్ పేపర్ల ప్రాక్టీస్
  • తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహణ
  • అర్హులకు శారీరక పరీక్షలు
  • గుంటూరు, విశాఖలో ర్యాలీలు

(ఆంధ్రన్రభ, గుంటూరు బ్యూరో )

From June 1: 2027 నియామక సంవత్సరానికి గాను, అగ్నిపథ్ పథకం, రెగ్యులర్ కేడర్ కింద భారత సైన్యంలో చేరడానికి ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సి.ఇ.ఇ) నిర్వహిస్తున్నట్టు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నిపథ్ పథకం, రెగ్యులర్ కేడర్ కింద భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్‌లైన్ సి.ఇ.ఇ, 2026 జూన్ 1 నుండి జూన్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో గల వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రారంభమవుతుందన్నారు. ఈ జిల్లాలలో అనంతపురం, గుంటూరు, వై.ఎస్.ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, ఎస్.పి.ఎస్ నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఎన్.టి.ఆర్ జిల్లాలు ఉన్నాయని తెలిపారు.

From June 1: ఆన్​ లైన్ లో.. మాక్​ ​ టెస్ట్​ పేపర్లు

అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్షా సూచనలను చదవవచ్చని, మాక్ టెస్ట్ పేపర్లను www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ చేయవచ్చన్నారు. అభ్యర్థులు ఈ ఆన్‌లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో సహా మొత్తం 13 భాషలలో ఏదో ఒక భాషలో రాయవచ్చన్నారు. ఆన్‌లైన్ సి.ఇ.ఇలో అర్హత సాధించిన అభ్యర్థులను, తదుపరి తేదీలలో గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ల ద్వారా నిర్వహించే రిక్రూట్‌మెంట్ ర్యాలీల సమయంలో, శారీరక పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన కోసం పిలవడం జరుగుతుందని చెప్పారు.

Leave a Reply